Share News

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Sep 08 , 2026 | 06:26 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgశనివారం హుండీ ఆదాయం: రూ.4.22 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 87,115

తలనీలాలు సమర్పించినవారు: 35,053


ఈ వార్తలు కూడా చదవండి:

‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌’ అవార్డుల్లో ఏపీ హవా

ఆ అధికారం మీకెక్కడిది?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 06:26 AM