పార్టీయే సుప్రీం!
ABN , Publish Date - Sep 08 , 2026 | 05:15 AM
ఎంపీలైనా.. ఎమ్మెల్యేలైనా ఎవరికైనా పార్టీయే సుప్రీమని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ స్పష్టం చేశారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత చంద్రబాబు బీ-ఫారం ఇవ్వకుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు కాలేరు.. మంత్రి పదవులు అనుభవించలేరని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి
పార్టీ పదవుల్లో ఉన్నవారిని
మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా గౌరవించాల్సిందే
టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో లోకేశ్ స్పష్టీకరణ
అమరావతి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎంపీలైనా.. ఎమ్మెల్యేలైనా ఎవరికైనా పార్టీయే సుప్రీమని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ స్పష్టం చేశారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత చంద్రబాబు బీ-ఫారం ఇవ్వకుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు కాలేరు.. మంత్రి పదవులు అనుభవించలేరని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. పార్టీ పదవుల్లో ఉన్నవారిని మంత్రులైనా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా గౌరవించాల్సిందేనని అన్నారు. పార్టీ ఏదైనా పని అప్పగిస్తే మిగిలిన వాటిని పక్కన పెట్టి దానికే ప్రాధాన్యమివ్వాలని అన్నారు. ‘క్వాంటం టవర్స్‌కు సంబంధించిన ఓ కార్యక్రమం ఉందని నన్ను ఆహ్వానించారు. అదే సమయంలో పార్టీ నాకో పని అప్పగించింది. క్వాంటం టవర్స్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను.’’ అని లోకేశ్ వివరించారు. ఎవరికైనా పార్టీ పనే తొలి ప్రాధాన్యం కావాలని అన్నారు. పార్టీ పదవుల్లో ఉన్న వారు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడానికి ఎవ్వరి అనుమతి అవసరం లేదని తెలిపారు. పార్టీని నిర్లక్ష్యం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, అలాంటి వారికి పార్టీలో భవిష్యత్తు ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది నిరంతరం సమీక్షించుకోవాలని సూచించారు. ‘మై టీడీపీ యాప్’లో పార్టీ కార్యక్రమాల వివరాలను పూర్తిగా అప్ డేట్ చేస్తున్నామని, ఆ సమాచారం ఆధారంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని లోకేశ్ సూచించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో వారు విజయాలు అందుకుంటారని లోకేశ్ అన్నారు.
తొలి రోజు ముగిసిన లీడర్‌షిప్ కాంక్లేవ్
మొత్తం ఐదు అంశాలపై సుదీర్ఘ చర్చ
టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో తొలి రోజు ఐదు అంశాలపై చర్చించారు. నాయకత్వ అభివృద్ధి, నాయకులను తీర్చిదిద్దడం, సరైన స్థానంలో సరైన వ్యక్తిని నిలబెట్టడం అనే అంశంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ప్రజంటేషన్ ఇచ్చారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌పై మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ప్రజంటేషన్ ఇచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, అజెండా అంశంపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజకీయ ఆర్థిక సాధికారత అంశంపై ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, మద్దిపాటి వెంకటరాజు ప్రజంటేషన్ ఇచ్చారు. సంపూర్ణ సంక్షేమం, సాధికారత అంశంపై మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయులు, సవిత ప్రజంటేషన్ ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి
స్పృహ తప్పిన వృద్ధుడికి ఏఎస్‌ఐ సేవలు