Share News

12న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:56 PM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి ఫుల్‌ అడిషనల్‌ చార్జి (ఎఫ్‌ఏసీ) పి. వాసు న్యాయాధికారులకు సూచించారు.

 12న జాతీయ లోక్‌ అదాలత్‌
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న పి. వాసు, బి. లీలా వెంకట శేషాద్రి

కర్నూలు లీగల్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి ఫుల్‌ అడిషనల్‌ చార్జి (ఎఫ్‌ఏసీ) పి. వాసు న్యాయాధికారులకు సూచించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని న్యాయాధికారులు, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న సివిల్‌, రాజీకి అర్హత కలిగిన క్రిమినల్‌ కేసులు, ఎక్సైజ్‌ కేసులు, ఫ్యామిలీ కేసులతో సహా పలు రకాల కేసులను ఈ జాతీయ లోక్‌ అదాలత్‌లో పరిష్కరిస్తారని తెలిపారు

Updated Date - Sep 07 , 2026 | 11:56 PM