కొనసాగిన స్పెషల్ డ్రైవ్
ABN , Publish Date - Sep 06 , 2026 | 02:48 AM
సర్ ప్రక్రియలో భాగంగా శనివారం జిల్లావ్యాప్తంగా ఓట్ల నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 1,709 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోల ఆధ్వర్యంలో కొత్త ఓట్ల నమోదుతో పాటు చేర్పులు, మార్పుల కోసం దరఖాస్తులను స్వీకరించారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : సర్ ప్రక్రియలో భాగంగా శనివారం జిల్లావ్యాప్తంగా ఓట్ల నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 1,709 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోల ఆధ్వర్యంలో కొత్త ఓట్ల నమోదుతో పాటు చేర్పులు, మార్పుల కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లోనే అందుకు అవసరమైన దరఖాస్తులను కూడా అందుబాటులో ఉంచారు. గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ఏజెంట్లు కూడా అందుబాటులో ఉండి ఓటర్లకు సహకరించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త ఓట్ల నమోదుకు 2002 మ్యాపింగ్‌తోపాటు అందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను కూడా తీసుకున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌ను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో తహసీల్దార్లు పర్యవేక్షించారు.