డిపాజిట్ సొమ్ము ఇచ్చేవరకూ కదలనంతే!
ABN , Publish Date - Sep 08 , 2026 | 05:41 AM
సహకార సంఘంలో డిపాజిట్ చేసిన తన డబ్బులు తిరిగి చెల్లించే వరకు కార్యాలయం వద్ద నుంచి కదిలేది లేదని ఓ వృద్ధుడు వినూత్న నిరసనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయానికి సోమవారం చిట్టూరి నరసింహమూర్తి (75)మం చం తీసుకొచ్చి వరండాలో తిష్ట వేసి సొసైటీ అధికారుల తీరును నిరసించారు.
సూర్యారావుపాలెం సొసైటీ వద్ద వృద్ధుడి వినూత్న నిరసన
ఉండ్రాజవరం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): సహకార సంఘంలో డిపాజిట్ చేసిన తన డబ్బులు తిరిగి చెల్లించే వరకు కార్యాలయం వద్ద నుంచి కదిలేది లేదని ఓ వృద్ధుడు వినూత్న నిరసనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయానికి సోమవారం చిట్టూరి నరసింహమూర్తి (75)మం చం తీసుకొచ్చి వరండాలో తిష్ట వేసి సొసైటీ అధికారుల తీరును నిరసించారు. సొసైటీలో జరిగిన భారీ ఆర్థిక అవకతవకల కారణంగా 180 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ‘2005 నుంచి 2019 మధ్యకాలంలో అధిక వడ్డీ ఇస్తామంటూ రైతుల నుంచి రూ.కోట్ల డిపాజిట్లు సేకరించారు. సుమారు రూ.4.40కోట్ల సొసైటీ నిధులను గత పాలకవర్గాలు స్వాహా చేశాయి. అయితే బాధ్యుల నుంచి రికవరీ చేయకుండా, డిపాజిట్‌దారులకు డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు’ అని బాధితుడు ఆరోపించారు. సొసైటీలో 180మంది రైతులకు చెందిన 408డిపాజిట్ ఖాతాలకు సంబంధించి రూ.3,12,59,794 బకాయిలు ఉన్నట్లు సొసైటీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.76 లక్షల నిధులు నిల్వలే ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదు చేసిన నలుగురికీ కలిపి రూ.24 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే, వారికి చెల్లిస్తే మిగిలినవారికి ఏం చెప్పాలని సొసైటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి