Share News

అంగరంగ వైభవంగా సిద్ధేశ్వరస్వామి రథోత్సవం

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:53 PM

ఆలూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవమైన సిద్ధేశ్వరస్వామి రథోత్సవం సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించారు.

అంగరంగ వైభవంగా సిద్ధేశ్వరస్వామి రథోత్సవం
ఆలూరులో సిద్ధేశ్వరస్వామి రథోత్సవంలో పాల్గొన్న అశేష జనం

ఆలూరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆలూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవమైన సిద్ధేశ్వరస్వామి రథోత్సవం సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే కోటవీధిలో వెలిసిన ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం చేపట్టారు. రథోత్సవ కార్యక్రమంలో ఆలూరు ప్రాంతం నంచే గాక ఆదోని, గుంతకల్‌, బళ్లారి, మద్దికెర తదితర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలకు దేవరట్టు మాల మల్లేశ్వరస్వామి ఆలయ మాజీ చైర్మన్‌ గుమ్మనూరు శ్రీనివాసులు, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ కురువ జయరాం, టీడీపీ నాయకులు మహేంద్ర హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు రాజన్న, ఆలయ కమిటీ పెద్దలు శాంతప్పగౌడ్‌, వీరభద్రగౌడ్‌ పాల్గొన్నారు.

మొలగవల్లి గ్రామంలో..

ఆలూరు రూరల్‌: మండలంలోని మొలగవల్లి గ్రామంలో వెలిసిన నాగ లింగేశ్వరస్వామి రథోత్సవాన్ని నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకం, గంగిపూజ, ప్రాతఃకాలపూజ, బిల్వార్చన, మహా మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు అర్చకులు ప్రసాద్‌స్వామి, నాగభూషణస్వామిలు నిర్వహించారు. సాయంత్రం రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 11:53 PM