కరువు సహాయక చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Dec 15 , 2023 | 12:21 AM
జిల్లాలో కరువు సహాయ చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు(కలెక్టరేట్), డిసెంబరు 14: జిల్లాలో కరువు సహాయ చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురు వారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సీపీఐ నగర సహాయ కార్య దర్శి మహేష్ అధ్యక్షతన నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజినేయులు, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య మాట్లాడుతూ 24 మండలాలను కరువు మండలాలుగా ప్రక టించారే గానీ ఎలాంటి కరువు సహాయ చర్యలు చేపట్టకపోవడం సిగ్గు చేటన్నారు. జిల్లాలో కరువుతో ప్రజలు విలవిల్లాడుతుంటే అధికా రులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్ర మంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రసూల్, నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, నగర కార్యవర్గ సభ్యులు నాగరాజు, ఈశ్వర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, సోమన్న, శరత్ పాల్గొన్నారు.