Share News

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:52 PM

తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కరువు సహాయక చర్యలు చేపట్టాలి
ధర్నాలో మాట్లాడుతున్న రామచంద్రయ్య

- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య

పత్తికొండ టౌన్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రైతులు సాగు చేసిన పంటలన్నీ దెబ్బతిని రైతులకు అపార నష్టం సంభవించిందని, తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక సీఆర్‌ భవన్‌ నుంచి సీపీఐ పార్టీ శ్రేణులు పట్టణ పురవీధులగుండా ర్యాలీ నిర్వహిస్తూ నాలుగు స్తంభాల కూడలిలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ ఉసేన్‌బాషాకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌ సాగు కింద రైతులు అనేక పంటలను సాగుచేశారన్నారు. విత్తనం మొదలు ఇంతవరకు వర్షాలు కురవకపోవడంతో పంటలన్నీ మొలకదశలోనే ఎండిపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు మండలాలుగా ప్రకటించి , ఎకరాకు రూ.50 వేలు చొప్పున పంట నష్టపరిహారం రైతులకు అందించి ఆదుకోవాలన్నారు. బ్యాంకులో ఉన్న రు ణాలను మాఫీ చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ, మం డల కార్యదర్శులు కారుమంచి, రామాంజనేయులు, నాయకులు కార న్న, వీరన్న, వెంకటరామిరెడ్డి, నెట్టెకంటయ్య, పెద్దముని పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 11:52 PM