Share News

గుడికి కాపలా కాచే గుండు

ABN , Publish Date - Oct 11 , 2026 | 08:27 AM

‘తిరుమల గుడి చుట్టూ ఓ శిలగుండు కాపలా కాస్తూ ఉండేదట’. వినడానికి కాస్తా ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ దీన్ని విశ్వసించేవారు నేటికీ చాలామంది ఉన్నారు.

గుడికి కాపలా కాచే గుండు
Tirumala Tirupati

‘తిరుమల గుడి చుట్టూ ఓ శిలగుండు కాపలా కాస్తూ ఉండేదట’. వినడానికి కాస్తా ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ దీన్ని విశ్వసించేవారు నేటికీ చాలామంది ఉన్నారు. తిరుమల క్షేత్రానికి పరిపాలకుడు రుద్రుడు (శివుడు). రుద్రునికి గుర్తుగా నేటికీ శ్రీవారి ఆలయంలోని బలిపీఠానికి సమీపంలో ఓ చిన్నపాటి శిల ఉంది. ఈ శిల పూర్వం రుద్రుని పూర్ణాంశతో ప్రకాశిస్తూ శ్రీవారి ఆలయం చుట్టూ తిరుగుతూ కాపలాగా ఉండేదట.

ప్రతీరోజు రాత్రి కైంకర్యాలు పూర్తయిన తర్వాత అర్చకస్వాములు తిరిగి వెళ్లే సమయంలో ఈ శిలపై తాళాలు పెట్టి నమస్కరించి వెళ్లేవారు. తిరిగి తెల్లవారిన తర్వాత వచ్చి అర్చకులు ఆ శిలకు నమస్కరించి తాళం చెవులు తీసుకునేవారట. ఒకనాటి రాత్రి ఆలయం చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఈ గుండు కొన్ని అనర్థాలు చోటుచేసుకున్నాయని, మళ్లీ అలాంటి దుర్ఘటన చోటుచేసుకోకూడదనే ఉద్దేశ్యంతో ఈ శిలను తిరుమలకు సమీపంలో గోగర్భంతీర్థం వద్దకు తరలించారని, అందులో చిన్నభాగమే ప్రస్తుతం ఆలయంలో దర్శనమిస్తోందని పూర్వీకుల చెబుతున్న మాట.


book2.jpgప్రస్తుతం గోగర్భం వద్దనున్న ఈ శిలపై కొన్నేళ్ల క్రితమే శివలింగాన్ని ప్రతిష్టించారు. తిరుమల స్థానికులు, వ్యాపారులు ప్రతీ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ అర్చకస్వాములు, అధికారులు మంగళ వాద్యాలతో అక్కడికి చేరుకుని రుద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే వేకువజాము కైంకర్యాలకు వెళ్లే అర్చకులు నేటికీ తాళాల గుత్తిని బలిపీఠం వద్దనున్న క్షేత్రపాలకుని శిలకు తాకించి గర్భాలయం ప్రవేశం చేస్తున్నారు. తిరిగి రాత్రి ఏకాంత సేవ అనంతరం తాళాల గుత్తిని ఈ శిలకు తాకించి నమస్కరించే వెళ్లే పద్ధతి కొనసాగుతూనే ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంటేనే!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 08:40 AM