Share News

పసిఫిక్ కాదు.. ట్రంప్ సముద్రం.. పేరు మార్చే యోచనలో అమెరికా అధ్యక్షుడు

ABN , Publish Date - Oct 11 , 2026 | 07:23 AM

అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లో ఒకదానికి ట్రంప్ సముద్రం లేదా అమెరికన్ల సముద్రం అని నామకరణం చేసే యోచనలో ఉన్నానని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు.

పసిఫిక్ కాదు.. ట్రంప్ సముద్రం.. పేరు మార్చే యోచనలో అమెరికా అధ్యక్షుడు
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: 2028లోపు ఒక మహాసముద్రం పేరు, ఒక నది పేరు మార్చాలని తాను భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లో ఒకదానికి ట్రంప్ సముద్రం లేదా అమెరికన్ల సముద్రం అని నామకరణం చేసే యోచనలో ఉన్నానని ఆయన వెల్లడించారు. అయితే తనకు హడ్సన్ నది పేరు, మిసిసిపి నది పేరు మార్చే ఉద్దేశం లేదని ట్రంప్ వివరించారు. ‘నాకు హడ్సన్ నది పేరు మార్చాలని లేదు. ఎందుకంటే ప్రసిద్ధ సముద్ర అన్వేషకుడు హెన్రీ హడ్సన్ గుర్తుగా నదికి ఆ పేరు పెట్టారు. ఆయనంటే నాకు ఎనలేని అభిమానం. అందుకే ఆ పేరు ఎట్టిపరిస్థితుల్లో మార్చను. అలాగే మిసిసిపి నది పేరు మార్చడం కూడా నాకు ఇష్టం లేదు. మిసిసిపి వల్లే ఎన్నికల్లో గెలవడం సాధ్యమైంది’ అని ఆయన పేర్కొన్నారు.


అయితే ఈ వ్యాఖ్యలను నెటిజన్లు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. ట్రంప్‌పై సెటైర్లు వేస్తున్నారు. ‘రేపో, ఎల్లుండో ట్రంప్ భూగ్రహం పేరు కూడా మార్చేస్తారు. దాన్ని ట్రంప్ ప్లానెట్ అని పిలుస్తారు’ అని ఒక యూజర్ ఎద్దేవా చేశారు. వాషింగ్‌టన్ డీసీ పేరు త్వరలో ట్రంప్‌విలేజ్‌గా మారబోతోందని మరో వ్యక్తి కామెంట్ చేశారు.


ఈ వార్తలూ చదవండి

నేటిలోగా విడుదల చేయకపోతే నిరాహారదీక్ష: వాంగ్‌చుక్‌

‘ఫ్లైదుబాయ్‌’ ఘటనపై ఎన్‌ఐఏ కేసు

Updated Date - Oct 11 , 2026 | 07:23 AM