16 జిల్లా పరిషత్‌లకు కొత్త సీఈవోలు
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:22 AM
రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ల సంఖ్య పెంచిన నేపథ్యంలో కొత్త జెడ్పీలకు ప్రభుత్వం సీఈవోలను నియమించింది.
3 జిల్లాలకు డిప్యూటీ సీఈవోలు.. ఉత్తర్వులు జారీ
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ల సంఖ్య పెంచిన నేపథ్యంలో కొత్త జెడ్పీలకు ప్రభుత్వం సీఈవోలను నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ శాఖ కమిషనర్ ప్రతిపాదనల మేరకు ఈ పోస్టింగ్‌లను ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం బదిలీలపై నిషేధం నడుస్తున్నా ప్రభుత్వం జెడ్పీ సీఈవోలకు కొంత మినహాయింపు ఇచ్చి బదిలీలు చేపట్టింది. 16 జిల్లా పరిషత్‌లకు సీఈవోలను నియమించింది. మూడు జిల్లాలకు డిప్యూటీ సీఈవోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!