దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!
ABN , Publish Date - Oct 11 , 2026 | 03:18 AM
తల్లికి వందనం పథకం రెండో విడతలో 3,29,201 మందికి లబ్ధి చేకూరనుంది. తొలుత ప్రభుత్వం అనుకున్న అంచనా కంటే 58,601 మంది విద్యార్థులు పెరిగారు.
ఈసారి 3.29 లక్షల మంది లబ్ధిదారులు
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకం రెండో విడతలో 3,29,201 మందికి లబ్ధి చేకూరనుంది. తొలుత ప్రభుత్వం అనుకున్న అంచనా కంటే 58,601 మంది విద్యార్థులు పెరిగారు. వారికి కూడా పథకం అమలు చేసేందుకు రూ.87.9 కోట్లు అదనపు భారం పడింది. దీంతో పెరిగిన సంఖ్యకు అనుగుణంగా పథకాన్ని అమలు చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 67,47,190 నుంచి 68,05,791కు పెరిగింది. మొత్తం వ్యయం రూ.10,120.78 కోట్ల నుంచి రూ.10,208.69 కోట్లకు పెరిగింది. రెండో విడత లబ్ధిదారులకు త్వరలోనే నగదు విడుదల చేయనున్నారు. మొదటి విడతలో ఒకటో తరగతి, ఇంటర్ మొదటి ఏడాదిలో చేరాల్సిన వారు, రికార్డులు సక్రమంగా లేనివారు మినహా మిగిలిన 64,76,590 మందికి పథకం అమలు చేశారు. షెడ్యూలు ప్రకారం ఆగస్టు 30నే రెండో విడత నగదు విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో రెండోవిడత నగదు విడుదలలో ఆలస్యం జరిగింది. దసరా లోపు వారికీ అందించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం