Share News

‘ఫ్లైదుబాయ్‌’ ఘటనపై ఎన్‌ఐఏ కేసు

ABN , Publish Date - Oct 11 , 2026 | 06:04 AM

ఫ్లైదుబాయ్‌ విమానంలోని కాక్‌పిట్‌లో కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌పై గత నెలలో జరిగిన దాడిపై ఉగ్రవాద నిరోధక సంస్థ(ఎన్‌ఐఏ) దృష్టి సారించింది. ఈ ఘటనకు ఉగ్రవాదులు కుట్రపన్ని ఉంటారన్న సందేహాలు తెరమీదికి రావడంతో ఆ కుట్రను వెలికి తీయాలని నిర్ణయించింది

‘ఫ్లైదుబాయ్‌’ ఘటనపై ఎన్‌ఐఏ కేసు
nia

  • ఉపా చట్టం కింద నమోదు..ఉగ్ర కుట్రపై విచారణకు నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబరు 10: ఫ్లైదుబాయ్‌ విమానంలోని కాక్‌పిట్‌లో కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌పై గత నెలలో జరిగిన దాడిపై ఉగ్రవాద నిరోధక సంస్థ(ఎన్‌ఐఏ) దృష్టి సారించింది. ఈ ఘటనకు ఉగ్రవాదులు కుట్రపన్ని ఉంటారన్న సందేహాలు తెరమీదికి రావడంతో ఆ కుట్రను వెలికి తీయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా ‘ఉపా’ చట్టం కింద ఎన్‌ఐఏ కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఫస్ట్‌ ఆఫీసర్‌(కో-పైలట్‌)ను నిందితుడిగా పేర్కొన్నారు. యాంటీ హైజాకింగ్‌ చట్టం-2016లోని సెక్షన్‌ 3, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం-1967లోని సెక్షన్‌ 15(1)(ఏ), అలాగే యూఏపీఏ(ఉపా చట్టం) సెక్షన్‌ 16 కింద కేసు నమోదు చేశారు. దీనిలో సెక్షన్‌ 15(1)(ఏ) ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించింది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఎన్‌ఐఏ కేసు నమోదు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Oct 11 , 2026 | 06:04 AM