Share News

సీపీఎం నేత గఫూర్‌కు పుత్రశోకం

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:05 AM

సీపీఎం సీనియర్‌ నేత, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌, ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మలమ్మ దంపతుల ఇంట విషాదం అలముకుంది.

సీపీఎం నేత గఫూర్‌కు పుత్రశోకం

  • అమెరికాలో గుండెపోటుతో కిరణ్‌ మృతి

  • పది రోజుల తర్వాత తెలిసిన సమాచారం

కర్నూలు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): సీపీఎం సీనియర్‌ నేత, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌, ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మలమ్మ దంపతుల ఇంట విషాదం అలముకుంది. అమెరికాలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ‘పేపాల్‌’లో సీనియర్‌ డేటా సైంటిస్ట్‌గా పని చేస్తున్న వారి కుమారుడు పీవీ కిరణ్‌(42) ఈ నెల ఒకటో తేదీన గుండెపోటుతో మరణించారు. ఆ సమాచారం శుక్రవారం రాత్రి తెలిసింది. బంధువులు, అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేతలు తెలిపిన వివరాల మేరకు కిరణ్‌ కాలిఫోర్నియాలోని సాన్‌జో్‌సలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. సెప్టెంబరు 30వతేదీ రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి చేరుకొని నిద్రపోయిన కిరణ్‌ తెల్లారిన తర్వాత ఉలుకుపలుకు లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించిన వైద్యులు గుర్తు తెలియని మృతదేహం(అన్‌నోన్‌ బాడీ)గా భావించి మార్చురీలో భద్రపరిచారు. అమెరికాలో ఉంటున్న కర్నూలు నగరానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అంతర్జాతీయ కమిటీ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ షా ఫహద్‌ సయ్యద్‌ మార్చురీకి చేరుకొని మృతదేహాన్ని వీడియోకాల్‌ ద్వారా కుటుంబ సభ్యులకు చూపించగా, కిరణ్‌దేనని గుర్తించారు. కిరణ్‌ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి తానా సభ్యులు రవి పొట్లూరి, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ గ్లోబల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ గురురాజా, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ సయ్యద్‌ ప్రయత్నిస్తున్నారు. కిరణ్‌ మృతదేహం భారత్‌కు రావడానికి మరో వారం పట్టే అవకాశం ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!

Updated Date - Oct 11 , 2026 | 05:05 AM