Share News

అంధ దంపతులకు టీడీపీ అండ

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:01 AM

అంధ దంపతుల కలలకు సాయం రంగులు అద్దింది. తిరుపతికి చెందిన కుంచెపు వెంకట శివరావు, లక్ష్మీకావ్య దంపతులిద్దరూ అంధులు.

అంధ దంపతులకు టీడీపీ అండ

  • పెన్షన్‌ను పునరుద్ధరించిన మంత్రి లోకేశ్‌ సిబ్బంది

  • పరిశోధన కోసం సీఎంఆర్‌ఎఫ్‌ నుంచీ చెక్కు

  • ల్యాప్‌టాప్‌ అందజేసిన చంద్రగిరి నేత

తిరుపతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): అంధ దంపతుల కలలకు సాయం రంగులు అద్దింది. తిరుపతికి చెందిన కుంచెపు వెంకట శివరావు, లక్ష్మీకావ్య దంపతులిద్దరూ అంధులు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. ఆ భార్యాభర్తలిద్దరూ చదువుల కోసం హైదరాబాద్‌ వెళ్లిన సమయంలో స్థానిక సచివాలయం సిబ్బంది శివరావు చనిపోయాడని, లక్ష్మీకావ్య ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని నమోదు చేశారు. దీంతో వారికి వచ్చే పెన్షన్‌ ఆగిపోయింది. న్యాయశాస్త్రంలో పీజీ చేసిన లక్ష్మీకావ్య రిసెర్చ్‌ చేయడానికి రాసిన ఏపీఆర్‌సెట్‌లో 33వ ర్యాంకు వచ్చింది. చదువుకు ఆర్థిక సాయం కోసం మంత్రి లోకేశ్‌ను కలవడానికి అమరావతికి వచ్చారు. మంత్రి లేకపోయినా ఓఎస్డీ వరప్రసాద్‌ స్పందించి ఇద్దరికీ పెన్షన్‌ మంజూరు చేయించారు.

లక్ష్మీకావ్యకు రిసెర్చ్‌ అవకాశం రావడంతో మళ్లీ లోకేశ్‌ను కలవడానికి సెప్టెంబరు 21న సచివాలయానికి వెళ్లారు. మంత్రి లేకపోయవడంతో ఆయన కార్యాలయ సిబ్బంది స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండేళ్ల ఫీజు నిమిత్తం రూ.50 వేలు చెక్కు అందించారు. అక్కడే ఉన్న తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత వీరపల్లి హేమాంబరధరరావు రూ.75 వేలతో ల్యాప్‌ టాప్‌ కొనుగోలు చేసి అంధ దంపతులకు అందించారు. అలాగే వారి కుమారుడు వెంకట షణ్ముఖ్‌ ప్రియాన్ష్‌ను చదివిస్తానని హామీ ఇచ్చారు.ఈ సాయానికి ఆ అంధ దంపతులు మంత్రికి, టీడీపీ నేతకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!

Updated Date - Oct 11 , 2026 | 05:01 AM