నేటిలోగా విడుదల చేయకపోతే నిరాహారదీక్ష: వాంగ్‌చుక్
ABN , Publish Date - Oct 11 , 2026 | 06:16 AM
పోలీసులు శనివారం నిర్బంధించిన యువ ఉద్యమకారులను ఆదివారం నాటికి విడుదల చేయకపోతే తాను మరోసారి నిరాహారదీక్షకు దిగుతానని, లేదా పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పోలీసులు శనివారం నిర్బంధించిన యువ ఉద్యమకారులను ఆదివారం నాటికి విడుదల చేయకపోతే తాను మరోసారి నిరాహారదీక్షకు దిగుతానని, లేదా పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘ఢిల్లీలో జరిగే ఉద్యమం శాంతియుతంగా, ఐక్యంగా ఉండాలని పిలుపునిస్తూ శుక్రవారం నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను. కానీ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం అప్రకటిత ఎమర్జెన్సీలోకి వెళ్తుందని అస్సలు ఊహించలేదు. ఎంతోమంది యువనేతలు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారని సంతోషించాను.. కానీ, వారినందరినీ అరెస్టు చేశారు. వాళ్లను రేపటిలోగా విడుదల చేయపోతే నిరాహారదీక్షకు లేదా పాదయాత్రకు దిగాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.