వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:25 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
బుధవారం హుండీ ఆదాయం: రూ.4.77 కోట్లు
గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 70,216
తలనీలాలు సమర్పించినవారు: 27,606
ఈ వార్తలు కూడా చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల
Read Latest AP News And Telangana News And International News And Telugu News