Share News

వైసీపీకి ‘ఉండి’ ఇన్‌చార్జి గుడ్‌బై

ABN , Publish Date - Jul 25 , 2026 | 05:25 AM

వైసీపీ ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జిగా తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న పీవీఎల్‌ నరసింహరాజు ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరం వైసీపీ కార్యాలయంలో ..

వైసీపీకి ‘ఉండి’ ఇన్‌చార్జి గుడ్‌బై

  • కష్టపడిన వాళ్లకు పార్టీలో చోటు లేదు: నరసింహరాజు

కాళ్ల, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జిగా తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న పీవీఎల్‌ నరసింహరాజు ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరం వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి విలువ లేదని.. గౌరవం లేని చోట ఉండలేనని చెప్పారు. ‘ఇన్‌చార్జిగా ఎవరికైనా ఇవ్వండి.. నాకు అభ్యంతరం లేదు.. కానీ యోగేంద్రబాబుకు ఇస్తే చేయలేనని జగన్‌ను కలిసి చెప్పాను. కానీ ఆయన్నే ఇన్‌చార్జిగా పెట్టారు. అంటే.. పోరా నీ లెక్కేముందని అన్నట్టే కదా! అందుకే రాజీనామా చేస్తున్నాను’ అని స్పష్టం చేశారు.

Updated Date - Jul 25 , 2026 | 05:27 AM