Share News

‘నీట్‌’తో దేశ వ్యతిరేక రాజకీయాలా?: వల్లూరు

ABN , Publish Date - Jul 25 , 2026 | 05:35 AM

నీట్‌ పరీక్ష వివాదాన్ని ఆసరాగా చేసుకుని దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు విద్యార్థుల ఉద్యమాన్ని రాజకీయ వేదికగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయని..

‘నీట్‌’తో దేశ వ్యతిరేక రాజకీయాలా?: వల్లూరు

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): నీట్‌ పరీక్ష వివాదాన్ని ఆసరాగా చేసుకుని దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు విద్యార్థుల ఉద్యమాన్ని రాజకీయ వేదికగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుందని, నీట్‌ పరీక్ష నిర్వహణ జరిగిన లోపాలను సరిదిద్దేందుకు వేగంగా చర్యలు చేపట్టిందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌, ఆప్‌, కమ్యూనిస్టు పార్టీలు విద్యార్థి ఉద్యమం ముసుగులో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు.

Updated Date - Jul 25 , 2026 | 05:37 AM