ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:55 AM
ఫీజు బకాయిలతో సర్టిఫికెట్లు పొందలేకపోతున్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఫైనలియర్ చదివి కోర్సులు..
2025-26 ఫైనలియర్ ఫీజులు రూ.600 కోట్లు చెల్లింపు
అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఫీజు బకాయిలతో సర్టిఫికెట్లు పొందలేకపోతున్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఫైనలియర్ చదివి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థుల ఫీజుల విడుదలకు ఆర్థిక శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. సుమారు రూ.600 కోట్ల మేర ఫీజులు కాలేజీల ఖాతాలకు జమ అవుతున్నాయి. దీంతో విద్యార్థులకు వెంటనే సర్టిఫికెట్లు అందనున్నాయి. కాగా, 2025-26 విద్యా సంవత్సరంలో నాలుగు క్వార్టర్ల ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఇంజనీరింగ్, డిగ్రీ, ఇతర కోర్సుల్లో ఫైనలియర్ చదివిన విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు నిలిపివేశాయి. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఫీజులను విడుదల చేసిన ప్రభుత్వం.. మిగిలిన విద్యార్థులకు దశలవారీగా బకాయిలు విడుదల చేయనుంది.