పాఠశాలకు 4.25 కోట్ల విరాళం
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:02 AM
జీఆర్‌ఎన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ చైర్మన్, నెల్లూరు జిల్లాకు చెందిన గంటా రమణయ్య నాయుడు మరోసారి దాతృత్వం చాటుకున్నారు.
పారిశ్రామికవేత్త గంటా రమణయ్య నాయుడి దాతృత్వం
నెల్లూరు విద్య, జూలై 24(ఆంధ్రజ్యోతి): జీఆర్‌ఎన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ చైర్మన్, నెల్లూరు జిల్లాకు చెందిన గంటా రమణయ్య నాయుడు మరోసారి దాతృత్వం చాటుకున్నారు. నెల్లూరు రూరల్ మండలం కల్లూరుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ.4.25 కోట్ల విరాళం అందజేశారు. శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈమేరకు చెక్కు అందజేశానని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా పీటీఎం కార్యక్రమంలో భాగంగా కల్లూరుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం విరాళం అందించినట్టు తెలిపారు. .