Share News

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Aug 01 , 2026 | 06:52 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.4.81 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 67,063

తలనీలాలు సమర్పించినవారు: 25,565


ఈ వార్తలు కూడా చదవండి:

రూ.84 వేల కోట్లతో సాగర మథనం

అయోధ్య రాముని విరాళాలపై కఠిన నిఘా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 06:52 AM