Share News

పాకిస్థాన్‌లోనూ బొద్దింకల ఉద్యమం!

ABN , Publish Date - Aug 01 , 2026 | 06:09 AM

జెన్‌ జీ ఉద్యమం ప్రకంపనలు భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ వినిపిస్తున్నాయి. కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) సారథ్యంలో..

పాకిస్థాన్‌లోనూ బొద్దింకల ఉద్యమం!

  • ఆ అవకాశాలు ఉన్నాయి: పాక్‌ హోం మంత్రి నఖ్వీ

ఇస్లామాబాద్‌, జూలై 31: జెన్‌ జీ ఉద్యమం ప్రకంపనలు భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ వినిపిస్తున్నాయి. కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) సారథ్యంలో భారత్‌లో జరిగినటువంటి ఉద్యమం పాకిస్థాన్‌లోనూ తలెత్తే అవకాశం ఉందని ఆ దేశ హోంమంత్రి మొహ్‌సిన్‌ నఖ్వీ హెచ్చరించారు. నిరాశా నిస్పృహలకు గురైన యువత ఒక్కటైతే అన్నింటినీ తలకిందులు చేయగలదని పేర్కొన్నారు. గురువారం ఇస్లామాబాద్‌లో జరిగిన ‘పాకిస్థాన్‌ ఆర్థిక సదస్సు’లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్థాన్‌ యువత ఆర్థిక సాయం కాదు.. ఉద్యోగాలను కోరుకుంటోంది’ అని నఖ్వీ పేర్కొన్నారు. ‘యువతను మీరు బొద్దింకలని పిలుస్తారా.. మరేమైనా పేరుతో పిలుస్తారా.. ఏదేమైనా, ఆ బొద్దింకలు ఐక్యమైతే అన్నింటినీ తలకిందులు చేయగలరు’ అని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 06:09 AM