విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు
ABN , Publish Date - Jul 31 , 2026 | 07:16 AM
టైర్డు ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్ కోసం 100 రోజుల్లో రూ.6,000 కోట్లు విడుదల చేస్తామన్న హామీ మేరకు మూడో విడతగా ప్రభుత్వం గురువారం మరో రూ.2,000 కోట్లు విడుదల చేసింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): రిటైర్డు ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్ కోసం 100 రోజుల్లో రూ.6,000 కోట్లు విడుదల చేస్తామన్న హామీ మేరకు మూడో విడతగా ప్రభుత్వం గురువారం మరో రూ.2,000 కోట్లు విడుదల చేసింది. మొదటి దఫాగా మే 29న రూ.2,000 కోట్లు, రెండో దఫాగా జూన్ 30న రూ.2,000 కోట్లు... మొత్తం రూ.4,000 కోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన రూ.2,000 కోట్లతో కలిపి మొత్తం రూ.6,000 కోట్లను విడుదల చేసినట్లయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ నిధులు విడుదల చేశారు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ప్రధానంగా భావించి ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ క్లియర్ చేయడానికి ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. రాబోయే రోజుల్లో మిగిలిన ఇతర బకాయిలను కూడా ఇదే రీతిలో క్లియర్ చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..
అదే జోరు.. వాన హోరు