అయోధ్య రాముని విరాళాలపై కఠిన నిఘా
ABN , Publish Date - Jul 31 , 2026 | 04:59 PM
అయోధ్య రాముని విరాళాలపై కఠిన నిఘా ఉంచాలని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు నిర్ణయం తీసుకుంది. విరాళాల సేకరణ, లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని 360 డిగ్రీల కెమెరాలతో వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది.
ఢిల్లీ, జులై 31 (ఆంధ్రజ్యోతి): అయోధ్య రాముని (Ayodhya Ram Mandir) విరాళాలపై కఠిన నిఘా ఉంచాలని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు నిర్ణయం తీసుకుంది. విరాళాల సేకరణ, లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని 360 డిగ్రీల కెమెరాలతో వీడియో రికార్డింగ్ చేయాలని ఈ ట్రస్ట్ ఆదేశించింది. రామమందిరంలో విరాళాల సేకరణ, లెక్కింపుపై కట్టుదిట్టమైన భద్రత నిఘా ఏర్పాటు చేయాలని హుకుం జారీ చేసింది. హుండీల నిర్వహణలో జులై 25వ తేదీ నుంచే అమల్లోకి కొత్త భద్రతా నిబంధనలు వచ్చాయని స్పష్టం చేసింది.
లెక్కింపు గది నుంచి ఖాళీ పెట్టెలు తీసుకెళ్లడం, విరాళాలు సేకరించడం, సీల్ వేసి రవాణా చేయడం వరకు అంతా కెమెరాల నిఘాలోనే ఉంచాలని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆదేశించింది. నిరంతర వీడియో రికార్డింగ్ కోసం ఇద్దరు ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్లను నియమిస్తున్నట్లు తెలిపింది. బ్యాంక్ ఉద్యోగులు, ట్రస్ట్ ప్రతినిధులు, ప్రైవేట్ సెక్యూరిటీతో ఎనిమిది మంది సభ్యుల మానిటరింగ్ టీమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
ఈ క్రమంలోనే అయోధ్య ఆలయంలోని 40 విరాళాల పెట్టెలను ఒకేసారి కాకుండా రోజువారీగా అధికారులు ఖాళీ చేస్తున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. హుండీ పెట్టెలను లెక్కింపు గదికి చేర్చిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అధికారులు సీల్ వేస్తున్నారని తెలిపింది. ఈ ఆలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలు, సిట్ అధికారుల విచారణ నేపథ్యంలో కఠిన చర్యలు చేపట్టినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు స్పష్టం చేసింది.
వార్తలు కూడా చదవండి...
2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు
నీట్ పేపర్ లీక్ నిరసన.. పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News