Share News

ఎస్‌బీఐకి 12 ఎకరాలు!

ABN , Publish Date - Aug 01 , 2026 | 06:12 AM

రాయదుర్గంలోని సర్వే నంబరు 83/1లో ఉన్న 5 ఎకరాల భూమికి ప్రత్యామ్నాయంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు రాష్ట్ర ప్రభుత్వం 12 ఎకరాల భూమిని ఇవ్వనుంది. రాయదుర్గంలోని...

ఎస్‌బీఐకి 12 ఎకరాలు!

  • రాయదుర్గంలో 2, ఫ్యూచర్‌సిటీలో 10 ఎకరాలు

  • ఒకటి రెండ్రోజుల్లో నిర్ణయం!

  • ఫ్యూచర్‌సిటీలో ఇచ్చే దాంట్లో 7 ఎకరాలు ఉచితం

  • ఎకరం రూ.4 కోట్ల చొప్పున మిగతా 3 ఎకరాలు

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాయదుర్గంలోని సర్వే నంబరు 83/1లో ఉన్న 5 ఎకరాల భూమికి ప్రత్యామ్నాయంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు రాష్ట్ర ప్రభుత్వం 12 ఎకరాల భూమిని ఇవ్వనుంది. రాయదుర్గంలోని సర్వే నంబరు 83/1కు కొంచెం అటుఇటుగా ఉన్న మరో సర్వే నంబరులో 2 ఎకరాలు, భారత్‌ ఫ్యూచర్‌సిటీలో 10 ఎకరాలు కలిపి మొత్తం 12 ఎకరాలు ఇవ్వనుంది. రాయదుర్గంలోని రెండు ఎకరాలకు ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం-ఎస్‌బీఐ మధ్యన జరిగిన ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత బహిరంగ మార్కెట్‌ విలువ, ప్రభుత్వ విలువను బేరీజు వేసుకుని ధరను ఖరారు చేయనున్నారు. ఆ ప్రకారమే రాయదుర్గంలో భూమిని ఎస్‌బీఐకి అప్పగిస్తారు. ఫ్యూచర్‌సిటీలో కేటాయించే 10 ఎకరాల్లో 7 ఎకరాలను ఎస్‌బీఐకి ఉచితంగా కేటాయిస్తారని విశ్వసనీయంగా తెలిసింది.

మిగతా 3 ఎకరాలకు.. ఒక్కో ఎకరాన్ని రూ.4 కోట్ల చొప్పున మొత్తం రూ.12 కోట్లకు ఇవ్వనున్నట్టు సమాచారం. ఎస్‌బీఐకి భూకేటాయింపులకు సంబంధించిన డ్రాఫ్‌ జీవోను ప్రభుత్వం సిద్ధం చేసిందని, ఒకటి, రెండ్రోజుల్లోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారికవర్గాల ద్వారా తెలిసింది. కాగా, రాయదుర్గంలోని సర్వే నంబరు 83/1లోని 5 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయగా.. ఎకరం రూ.237 కోట్ల రికార్డు ధర పలికింది. అయితే ఆ భూములు తమవేనంటూ ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్‌బీఐ ద్వారా జరుపుతున్న లావాదేవీలన్నింటి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. దీంతో అప్రమత్తమైన బ్యాంకు రాజీకి వచ్చింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ భూకేటాయింపులకు, హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ఉపసంహరణకు అంగీకరించింది. దీంతో ప్రభుత్వం ఎస్‌బీఐకి భూకేటాయింపులకు చర్యలు చేపట్టిందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి:

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 07:36 AM