Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:54 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ap1.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4.76 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 78,709

తలనీలాలు సమర్పించినవారు: 31,312


ఈ వార్తలు కూడా చదవండి:

‘పుర‘పోరుకు రెఢీ

భారీ భవనాల్లో ఈవీ చార్జింగ్‌ యూనిట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 06:54 AM