Share News

సౌరవ్‌ దాస్‌ పనికిరానోడు!

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:14 AM

జెన్‌-జీ నిరసనకారులపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌, ఈసారి కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ను లక్షఽ్యంగా చేసుకొని...

సౌరవ్‌ దాస్‌ పనికిరానోడు!

28 ఏళ్ల వ్యక్తి విద్యార్థా?.. ఆ వయసులో నేను 2 జాతీయ అవార్డులు సాధించా

  • దాస్‌.. నువ్వో నిరుద్యోగివి.. ఏ పనైనా నేర్చుకో

  • సీజేపీ అధికార ప్రతినిధిపై కంగన వ్యాఖ్యలు

  • ఆమె మానసిక స్థితి సరిగా లేదు: సౌరవ్‌ దాస్‌

  • కంగన వ్యాఖ్యలు సిగ్గుచేటు: సోనూ సూద్‌

న్యూఢిల్లీ, జూలై 29: జెన్‌-జీ నిరసనకారులపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌, ఈసారి కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ను లక్షఽ్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. సౌరవ్‌ దాస్‌ ఓ పనికిరాని వ్యక్తి అని, నిరుద్యోగి అని దుమ్మెత్తిపోశారు. 28 ఏళ్ల సౌరవ్‌ దాస్‌ విద్యార్థినని ఎలా చెప్పుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ‘‘సౌరవ్‌.. నువ్వు విద్యార్థివి కాదు.. పనీపాటాలేనోడివి! ఇప్పటికైనా ఏ పనైనా నేర్చుకో’’ అని ఆయన్నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన వయసులో తాను రెండు జాతీయ అవార్డులు సాధించానని కంగన చెప్పుకొన్నారు. జెన్‌-జీ నిరసనకారులు ‘మురికి కాలువ తరం’ (గట్టర్‌ జనరేషన్‌) అంటూ ఇన్‌స్టా వేదికగా ఇదివరకే ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఈ వ్యాఖ్యలపైౖ సౌరవ్‌ దాస్‌ స్పందించారు. యువతరాన్ని ఉద్దేశించి కంగన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి ఆమె మానసిక స్థితి సరిగా లేదని అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. మీ ఇంట్లో జెన్‌-జీ, జెన్‌-ఆల్ఫా తరం వారు ఉంటే వారిని కూడా మీరు ‘గట్టర్‌ జనరేషన్‌’ అని అనగలరా? అని కంగనను ప్రశ్నించారు.


ఆమె వ్యాఖ్యలను బీజేపీ నేతలే సీరియ్‌సగా తీసుకోరని, ఆమె గురించి ఇంతకన్నా తానేం చెప్పగలనని ప్రశ్నించారు. ‘ఎంపీ అయ్యాక చాలా కష్టపడాల్సి వస్తోంది’ అంటూ సొంత నియోజకవర్గ ప్రజలతో కంగన అన్నారని.. దీన్నిబట్టి ప్రజాసేవలో ఆమె నిబద్ధత ఏపాటిదో అర్థమవుతోందని దాస్‌ ఎద్దేవా చేశారు. సీజేపీ పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిమానం నేపథ్యంలో ఆ పార్టీ చేస్తున్న నిరసనలను, యువతను విమర్శించడం ద్వారా కంగన వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీనిపై ఇన్‌స్టా వేదికగా కంగన స్పందిస్తూ.. దాస్‌ ఎవరు? అని తాను గూగుల్‌ చేసినప్పుడు, ఓ 28ఏళ్ల వ్యక్తి అని తెలిసిందని, మరి.. తానో స్టూడెంట్‌ను అని చెప్పుకొనే ఆయన, విద్యార్థి ఎలా అవుతారు? అని ప్రశ్నించారు. ‘‘నేను లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన మాటవాస్తవమే. కానీ నేనో సినీ నటిని, దర్శకురాలిని, నిర్మాతను, స్ర్కిప్ట్‌ రైటర్‌ను, ఆంత్రప్రెన్యూర్‌ను. మరి.. సౌరవ్‌ దాస్‌ ఎవరు? ఓ పనికిరాని వ్యక్తి, నిరుద్యోగి తప్ప’’ అని కంగన వ్యాఖ్యానించారు. కాగా జెన్‌-జీని ఉద్దేశించి ‘గట్టర్‌’ అంటూ కంగన చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని ప్రముఖ నటుడు సోనూ సూద్‌ అన్నారు. ప్రజలు కనిపించే దేవుళ్లు అని, ఏదైనా మాట్లాడేముందు జాగ్రత్తగా ఆలోచించాలని హితవు పలికారు. నటులుగా, సెలిబ్రెటీలుగా ఎదిగిన వారు తమ ఉనికికి సార్థకత ప్రజలతో మమేకం అయినప్పుడే ఉంటుందన్న విషయాన్ని గుర్తెరగాలని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 06:14 AM