Share News

సూర్యాపేట పెద్దగట్టు జాతరకు ముహూర్తం ఖరారు.. ఐదు రోజుల పాటు ఉత్సవాలు

ABN , Publish Date - Nov 16 , 2026 | 02:51 PM

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని శ్రీలింగమంత్రుల స్వామి (పెద్దగట్టు) జాతర తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆలయ ట్రస్టు బోర్టు సభ్యులు, పూజరులు జాతర తేదీల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

సూర్యాపేట పెద్దగట్టు జాతరకు ముహూర్తం ఖరారు.. ఐదు రోజుల పాటు ఉత్సవాలు
Pedda Gattu Jatara 2027

సూర్యాపేట జిల్లా, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని శ్రీలింగమంత్రుల స్వామి (పెద్దగట్టు) (Pedda Gattu Jatara 2027) జాతర తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆలయ ట్రస్టు బోర్టు సభ్యులు, పూజరులు జాతర తేదీల షెడ్యూల్‌ను విడుదల చేశారు. తెలంగాణలో రెండో అతి పెద్ద జాతరగా ఈ ఉత్సవం పేరు పొందింది. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరను 2027 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.


2027 ఫిబ్రవరి 21వ తేదీన సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవరపెట్టెను పెద్దగట్టు పైకి తీసుకురావడం, గంపల ప్రదక్షిణ జరగనుంది. ఫిబ్రవరి 22వ తేదీన స్వామివారికి భక్తులు బోనాలను సమర్పించనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీన చంద్రపట్నం వేయనున్నారు. ఫిబ్రవరి 24వ తేదీన దేవరపెట్టను కేసారానికి తరలించనున్నారు. ఫిబ్రవరి 25వ తేదీన జాతర ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన చీకటాయపాలెం నుంచి దేవరపెట్టెను తరలించనున్నారు. శ్రీలింగమంత్రుల స్వామికి ఫిబ్రవరి 7వ తేదీన ఆదివారం రాత్రి 11 గంటలకు దిష్టి పూజ జరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 03:36 PM