Share News

ఇలా చేయడం ధర్మమేనా..?

ABN , Publish Date - Jun 03 , 2026 | 11:12 AM

చెన్నై-కలకత్తా జాతీయ రహదారి పక్కన మల్లాం జంక్షన్‌ నాయుడుపేట ప్రాం తంలో పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఇలా చేయడం ధర్మమేనా..?
Panchamukha Anjaneya Swamy Statue

  • పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహంపై నిర్లక్ష్యం

నాయుడుపేట టౌన్‌(తిరుపతి): చెన్నై-కలకత్తా జాతీయ రహదారి పక్కన మల్లాం జంక్షన్‌ నాయుడుపేట ప్రాం తంలో పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహ ప్రాంగణం నిర్వహణ పర్యవేక్షణను గత 5 సంవత్సరాలుగా టీటీడీ అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. రోడ్డు ప్ర మాదాల నివారణ భద్రతా ప్రమాణాల దృష్ఠ్యా పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహా న్ని 2017వ సంవత్సరంలో అప్పటి తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి జాతీయ రహదారి పక్కన తన సొంత స్థలంలో టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించారు.


జాతీయ రహదారి పరిసరాలలో ఎక్కడా పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం లేకపోవడం... ఈ ప్రాంతంలో ఉండటంతో పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ పరిసరాలు ఆధ్యాత్మికతతో భక్తి భావం వెల్లవిరిసేలా ఉండేవి. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనచోదకులతోపాటు చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు కూడా తమ భక్తి భావాన్ని కొనసాగించేవారు. అలాగే విగ్రహానికి సమీపంలో పెట్రోల్‌ బంకు ఇతర దుకాణాలు ఉండటంతో విగ్రహం వద్ద భద్రతా పర్యవేక్షణ ఉండేది. అయితే రేణిగుంట-నాయుడుపేట రహదారి విస్తరణ పనుల్లో భాగంగా బ్రిడ్జి నిర్మాణ పనులు ఈ విగ్రహానికి సమీపంలో పూర్తయ్యాయి.


anja2.jpgఈ పనుల్లో భాగంగా విగ్రహానికి సమీపంలో ఇష్టానుసారంగా గుంటలు తవ్వేసి మిగిలినరాళ్లు రప్ప లు తీసుకువచ్చి విగ్రహం వద్ద డంప్‌చేసి అలాగే వదిలి వేయడంతో పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రాంగణం నేడు శిథిలాలు, ముళ్లపొదల మధ్య నిలిచిపోయిందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా టీటీడీ అధికారులు దృష్టిసారించి ఈ ప్రాంగణ పరిసరాలు పరిశుభ్రం చేయించి విగ్రహానికి కొత్త రంగులు వేసి ఫ్లడ్‌ లైట్‌లు ఏర్పాటు చేసి గత వైభవాన్ని తీసుకురావాలని ్డప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి

290 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 11:12 AM