Share News

వెంకటపాలెంలో జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 16 , 2026 | 01:03 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు.

వెంకటపాలెంలో జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
AP CM Nara Chandrababu Naidu

అమరావతి, జులై 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) ఈరోజు (గురువారం) సాయంత్రం గుంటూరు జిల్లాలోని వెంకటపాలెం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం 4:50 గంటలకు ఆలయం వద్దకు సీఎం చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం 5:00 గంటలకు ప్రారంభమయ్యే జగన్నాథ రథయాత్రకు సీఎం హాజరుకానున్నారు.


పవిత్ర జగన్నాథ రథయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు చేయనున్నారు. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ప్రార్థించనున్నారు. భక్తిశ్రద్ధలతో ఈ రథయాత్రను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోనున్నారు. సీఎం చంద్రబాబు రథయాత్రలో పాల్గొననున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు. ‘జై జగన్నాథ్’ నినాదాల మధ్య జరిగే ఈ రథయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొనడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకురానుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం.. మంత్రి నిమ్మల ధ్వజం

తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 02:25 PM