డ్రగ్స్ అడ్డాగా నాంపల్లి!
ABN , Publish Date - Apr 14 , 2026 | 09:17 AM
నగరంలో కీలక ప్రాంతమైన నాంపల్లి డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోంది. రైల్వే స్టేషన్ మొదలుకొని నాంపల్లి పరిసరాల్లో డ్రగ్స్ తీసుకొని తిరుగుతున్న వారు కనిపించడమే ఇందుకు నిదర్శనం.
పట్టుబడుతున్న విక్రేతలు, వినియోగదారులు
వారంలో మూడు డ్రగ్స్ కేసులు వెలుగులోకి
పోలీసులకు చిక్కిన 11 మంది
బస్తీల్లో డ్రగ్స్ కల్చర్‌పై కలకలం
హైదరాబాద్ సిటీ: నగరంలో కీలక ప్రాంతమైన నాంపల్లి డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోంది. రైల్వే స్టేషన్ మొదలుకొని నాంపల్లి పరిసరాల్లో డ్రగ్స్ తీసుకొని తిరుగుతున్న వారు కనిపించడమే ఇందుకు నిదర్శనం. దాంతో నిఘా పెట్టిన నాంపల్లి పోలీసులు వారం రోజుల వ్యవధిలో నాలుగు డ్రగ్స్ కేసులు నమోదు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్రగ్స్ కేసుల వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం. పోలీసు వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు డ్రగ్స్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
వారాసిగూడ అంబర్‌నగర్‌కు చెందిన సయ్యద్ సమీర్ మాలిక్ అలియాస్ డీజే సమీర్(25), డబీర్‌పురాకు చెందిన రెహ్మన్ షరీఫ్(26), కామాటిపురా కమేలాకు చెందిన షేక్ మహ్మద్ అలియాస్ డీజే సమీర్(25).. ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జీల వద్ద విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 2.33 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 4 ఎల్‌ఎ్‌సడీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు.
నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న హార్టికల్చర్ సమీపంలో నగులురు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నారాయణగూడకు చెందిన రఘు(26), కాచిగూడకు చెందిన ఎం.సాయిలు(25), రసూల్‌పురాకు చెందిన ప్రేమ్‌జీ తంగం బెన్ని(25), జేబిన్ పులికున్నాయ్ పో జోష్(26)గా గుర్తించారు. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించగా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.

రెడ్‌హిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ వద్ద ఈ నెల 9న నలుగురు డ్రగ్స్ మత్తులో పోలీసులకు చిక్కారు. వారిలో నాంపల్లి బజార్‌ఘాట్ ప్రాంతం లక్ష్మీనగర్‌కు చెందిన ఐటీఐ విద్యార్థి డి.హరిప్రసాద్ అలియాస్ బబ్లూ(22), బిర్జు నర్సింగ్ అలియాస్ బల్లు(21), బిలాల్ మసీదు ప్రాంతంలో ఉండే ఎండీ జుబేర్(37), ఎండీ గౌస్(36)గా గుర్తించారు. వారిని అబిడ్స్‌లోని ఈగల్ కార్యాలయానికి పంపించి పరీక్షలు చేయించగా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారు.,? ఎక్కడి నుంచి తెస్తున్నారు..?
ఎంతకాలంగా ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతోంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒక వారం రోజుల్లో మూడు డ్రగ్స్ కేసులు వెలుగులోకి రావడం, 11 మంది పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. బస్తీల్లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుండటంతో అటు పోలీసులు, ఇటు స్థానికులు విస్తుపోతున్నారు. పట్టుబడ్డ వారిలో ముగ్గురు స్మగ్లర్స్‌ను రిమాండ్‌కు, మిగిలిన 8 మంది డ్రగ్స్ వినియోగదారులను రీ హాబిలిటేషన్ సెంటర్స్‌కు తరలించినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. తగ్గిన పసిడి, వెండి ధరలు
రాజధాని అమరావతి జోలికొస్తే ఖబడ్దార్
Read Latest Telangana News and National News