తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
ABN , Publish Date - Apr 14 , 2026 | 08:45 AM
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని తెలిపింది.
హైదరాబాద్/ అమరావతి, ఏప్రిల్ 14: ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ఈ రోజు (మంగళవారం) అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఈ ఏడాది దేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.
ఎల్‌నినో పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందు వల్లే ఈ పరిస్థితి అని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అవి నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపిస్తాయని వివరించింది. దేశంలోని అధిక భాగం సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్యం, వాయువ్యం, దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ లేదా అంత కంటే తక్కువ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు కేసీఆర్ ఘన నివాళి
రెండు రోజుల పర్యటన కోసం తిరుపతికి లోకేశ్
For More AP News And Telugu News