Share News

విషాదం.. 12వ అంతస్తు నుంచి దూకి యువకుడు ఆత్మహత్య

ABN , Publish Date - Apr 14 , 2026 | 07:36 AM

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక జనప్రియ నీల్ వ్యాలీ అపార్ట్‌మెంట్‌లో 12వ అంతస్తు నుంచి దూకి వంశీ (29) అనే యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

విషాదం.. 12వ అంతస్తు నుంచి దూకి యువకుడు ఆత్మహత్య
Tragic Incident Ameenpur

అమీన్‌పూర్, ఏప్రిల్ 14: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక జనప్రియ నీల్ వ్యాలీ అపార్ట్‌మెంట్‌లో 12వ అంతస్తు నుంచి దూకి వంశీ (29) అనే యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. అనారోగ్యం, నిరుద్యోగం కారణంగా ఏర్పడిన మానసిక ఒత్తిడితోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన వంశీ, అమీన్‌పూర్‌లోని జనప్రియ నీల్ వ్యాలీలో నివసిస్తున్న తన అక్క, బావ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో అక్క, బావ లేకపోవడంతో.. ఒంటరిగా ఉన్న వంశీ ఒక్కసారిగా 12వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలైన వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు.


వంశీ గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఎన్ని మందులు వాడుతున్నా ఫలితం లేకపోవడంతో నిరాశకు లోనయ్యాడు. దానికి తోడు గత మూడు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. భవిష్యత్తుపై ఆందోళనతో వంశీ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అనారోగ్యం, ఉద్యోగం లేకపోవడం రెండూ తోడవడంతో తీవ్రమైన ఒత్తిడి గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో వంశీ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


ఇవి కూడా చదవండి...

బీఆర్‌ఎస్ పోస్టులు.. కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు

బ్రెయిన్ డెడ్ యువకుడి అవయవదానం... 8 మందికి పునర్జన్మ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 14 , 2026 | 07:36 AM