Share News

బ్రెయిన్ డెడ్ యువకుడి అవయవదానం... 8 మందికి పునర్జన్మ

ABN , Publish Date - Apr 13 , 2026 | 01:50 PM

తాను చనిపోతూ ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చాడు యువకుడు. సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిర‌ణ్‌కు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యింది.

బ్రెయిన్ డెడ్ యువకుడి అవయవదానం... 8 మందికి పునర్జన్మ
Organ Donation

సంగారెడ్డి, ఏప్రిల్ 13: సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్(22) తాను చనిపోతూ ఎనిమిది మందికి పునర్జన్మనిచ్చి సమాజానికి ఆదర్శంగా నిలిచాడు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి కుటుంబ సభ్యులు మానవత్వం చాటుతూ అవయవదానానికి ముందుకు వచ్చారు. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు ఉదయ్ కిరణ్. ఈ నెల 4న హైదరాబాద్‌లోని నిజాంపేట బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా కళ్లు తిరిగి కిందపడ్డాడు.


తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నెల 11న బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో అవయవదానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. ఎనిమిది మందికి పునర్జన్మ ప్రసాదించాడు ఉదయ్ కిరణ్. యువకుడి మరణం కుటుంబానికి దుఃఖాన్ని మిగిల్చినా.. అతని అవయవాలు ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాయి. కొత్లాపూర్ గ్రామంలో ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యువకుడికి నివాళులర్పించారు.


ఇవి కూడా చదవండి...

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ పోస్టులు.. కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 13 , 2026 | 01:57 PM