Home » Organ Donation
తాను చనిపోతూ.. మరో ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించింది ఓ వైద్యురాలు. రోహిణి అనే వైద్యురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. బ్రెయిన్ డెడ్ అవడంతో అవయవాలను దానం చేశారు. వాటిని ఐదుగురికి అమర్చారు.
అవయవదానం చేసేవారు దేవుళ్లతో సమానం అని సినీ నటుడు చిరంజీవి అన్నారు. దేవుడు ఎక్కడో లేడని.. మంచి మనసులో, దానగుణంలో ఉంటాడని..
అవయవ దానం ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ వివరించారు. పౌరులు, ముఖ్యంగా యువకులు, డిఫెన్స్ సిబ్బంది ఈ మహోన్నత ఆశయం కోసం ముందుకు రావాలని, అవయవ దానాన్ని జాతీయ ఉద్యమంగా చేపట్టాలని కోరారు.
అవయవ దానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో ప్రతి పది లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 అవయవ దానాలు జరిగితే, రాష్ట్రంలో 4.88 జరిగాయని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
అవయవ మార్పిడి డేటా ఆస్పత్రులు పంచుకోకపోవడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని ఆస్పత్రులు ఇకపై నేషనల్ ట్రాన్స్‌ప్లాంట్ రిజిస్ట్రీలో డేటాను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించింది. దీనివల్ల పారదర్శకత పెరిగి, సమానమైన అవయవ కేటాయింపులకు దారితీయవచ్చు
తెలంగాణ రాష్ట్ర అవయవ దానం బిల్లు-2025కు అసెంబ్లీ గురువారం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2011లో కొన్ని సవరణలతో సమగ్రంగా రూపొందించిన చట్టాన్నే రాష్ట్రంలో కూడా అమలు చేయాలని నిర్ణయించి, దానికి అనుగుణంగా ఈ బిల్లుకు రూపకల్పన చేశారు.
కుమారుడు బ్రెయిన్‌డెడ్ అయిన బాధలోనూ అతడి తల్లిదండ్రులు మానవత్వం చాటుకున్నారు. జీవన్‌దాన్ ట్రస్టుకు అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చారు.
మానవ అవయవ మార్పిడిలో అక్రమాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం ఇక ఉక్కుపాదం మోపనుంది. నిబంధనలకు విరుద్ధంగా అవయవ మార్పిడులకు పాల్పడితే భారీ జరిమానాతోపాటు పదేళ్ల జైలుశిక్ష కూడా విధించనుంది.
బ్రెయిన్ డెడ్ అయిన మహిళ కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించి ముగ్గురికి ప్రాణదానం చేశారు. ఏపీలోని బాపట్ల పట్టణం వివేకానంద నగర్ కాలనీకి చెందిన కొపనాతి వరలక్ష్మి(45) మెదడు సంబంధిత వ్యాధితో ఈ నెల ఆరో తేదీ గుంటూరులోని ఆస్టర్ రమేశ్ హాస్పిటల్స్‌లో చేరారు.
బ్రెయిన్ డెడ్ అయిన యువకుడు అవయవదానంలో ఆరుగురు పునర్జన్మ పొందారు. రామనాథపురం(Ramanathapuram) జిల్లా కడలాడి ప్రాంతానికి చెందిన సంజయ్ (22) ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ నెల 22న కొత్త ద్విచక్రవాహనం కొనుగోలు చేసేందుకు మదురైలోని షోరూమ్‌కు వెళ్లాడు.