Army Chief: అవయవ దానానికి ముందుకు వచ్చిన ఆర్మీ చీఫ్ దంపతులు
ABN , Publish Date - Aug 20 , 2025 | 07:08 PM
అవయవ దానం ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ వివరించారు. పౌరులు, ముఖ్యంగా యువకులు, డిఫెన్స్ సిబ్బంది ఈ మహోన్నత ఆశయం కోసం ముందుకు రావాలని, అవయవ దానాన్ని జాతీయ ఉద్యమంగా చేపట్టాలని కోరారు.
న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi), ఆయన భార్య సునీత ద్వివేది తమ అవయవాలను మరణాంతరం దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మరణాంతరం అవయవ దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి అనేక మంది ప్రాణాలను కాపాడగలుగుతారు. అవయవ దానంపై చైతన్యం పెంచేందుకు హర్యానాలోని చండీమందిర్ మిలటరీ స్టేషన్‌లో జరిగిన అవగాహన కార్యక్రమంలో ద్వివేది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను, తన భార్య మరణాంతరం అవయవ దానం చేస్తామని 'ప్లెడ్జ్' చేశారు.
అవయవ దానం ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ వివరించారు. పౌరులు, ముఖ్యంగా యువకులు, డిఫెన్స్ సిబ్బంది ఈ మహోన్నత ఆశయం కోసం ముందుకు రావాలని, అవయవ దానాన్ని జాతీయ ఉద్యమంగా చేపట్టాలని కోరారు. నేషనల్ ఆర్గాన్ డొనేషన్ అండ్ ఎలొకేషన్ ప్రోగ్రాం కింద మార్పులు చేపట్టం జరిగిందని, అవయవాల కేటాయింపులు ఇప్పుడు మహిళా రెసిపెంట్స్‌కు, డోనార్ ఫ్యామిలీస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మరింత మంది డోనార్లు ముందుకు వచ్చేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు.
ఏటా సుమారు 20,000 అవయవాల మార్పిడి (ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్స్) ఇండియాలో జరుగుతున్నాయని, గ్లోబల్ ర్యాకింగ్‌లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. సరిహద్దులను రక్షించడమే కాకుండా సమాజ సంక్షేమం కూడా ఆర్మీ బాధ్యత కావాలని అన్నారు. ఈ బాధ్యతకు కొనసాగింపే అవయదానమని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
రాజీవ్ ప్రతాప్ రూడీతో చేతులు కలిపిన రాహుల్
ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్
For National News And Telugu News