Share News

Rahul Hanshake Rudy: రాజీవ్ ప్రతాప్ రూడీతో చేతులు కలిపిన రాహుల్

ABN , Publish Date - Aug 20 , 2025 | 06:13 PM

ఇటీవల జరిగిన కాన్‌స్టిట్యూషన్ క్లబ్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్)గా రూడీ మరోసారి ఎన్నికయ్యారు. బీజేపీ నేత సంజీవ్ బల్యాన్‌పై ఆయన భారీ ఆధిక్యతతో గెలిచారు. మొత్తం 1,295 ఓట్లలో 707 ఓట్లు రూడీ గెలుచుకున్నారు.

Rahul Hanshake Rudy: రాజీవ్ ప్రతాప్ రూడీతో చేతులు కలిపిన రాహుల్
Rahul gandhi with Rajiv pratap rudy

న్యూఢిల్లీ: కాన్‌స్టిట్యూషన్ క్లప్ అఫ్ ఇండియా ఎన్నికల్లో ఇటీవల గెలుపొందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ (Rajiv Pratap Rudy)ని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారంనాడు అభినందించారు. ఆయనతో కరచాలనం (Shakehand) చేరారు.


పార్లమెంటు వద్ద మీడియాతో రాహుల్ మాట్లాడుతుండగా అటువైపు ప్రతాప్ రూడీ వచ్చారు. రాహుల్ వెళ్లి ఆయనను గ్రీట్ చేశారు. అనంతరం 'మా మధ్య (కాంగ్రెస్, బీజేపీ) ఇదొక అన్‌కామన్ హ్యాండ్‌షేక్. కంగ్రాట్యులేషన్స్' అని మీడియాతో మాట్లాడుతూ రాహుల్ అన్నారు. రాహుల్ అభినందించడంతో రూడీ సైతం థాంక్స్ చెప్పారు.


ఇటీవల జరిగిన కాన్‌స్టిట్యూషన్ క్లబ్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్)గా రూడీ మరోసారి ఎన్నికయ్యారు. బీజేపీ నేత సంజీవ్ బల్యాన్‌పై ఆయన భారీ ఆధిక్యతతో గెలిచారు. మొత్తం 1,295 ఓట్లలో 707 ఓట్లు రూడీ గెలుచుకున్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీఏ మాజీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ సహా పలువురు మంత్రులు, విపక్ష నేతలు ఈ ఎన్నికల్లో ఓటు వేశారు.


ఇవి కూడా చదవండి..

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్

లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి

For National News And Telugu News

Updated Date - Aug 20 , 2025 | 06:14 PM