Share News

ఐదుగురి ప్రాణాలను కాపాడిన 10 నెలల చిన్నారి..

ABN , Publish Date - Feb 14 , 2026 | 05:41 PM

10 నెలల ఓ చిన్నారి.. తాను చనిపోతూ, తన అవయవాల ద్వారా ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అందరినీ కంటతడి పెట్టిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

ఐదుగురి ప్రాణాలను కాపాడిన 10 నెలల చిన్నారి..
Kerala Baby Organ Donor

ఇంటర్నెట్ డెస్క్: కేరళలో(Kerala) చోటు చేసుకున్న ఓ హృదయ విదారక ఘటన.. ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టిస్తోంది. తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన వయసులో.. ఓ చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. అయితే ఆ పసికందు ప్రాణాలు.. ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపాయి. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని మల్లపల్లిలోని తూర్పు పులించిమూట్టిల్‌కు చెందిన అబ్రహం షిబు, షెరిన్ దంపతులకు 10 నెలల వయసున్న అలెన్ షెరిన్ అబ్రహం(Alin Sherin Abraham) అనే కుమార్తె ఉంది. ఈ నెల 5న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో అలెన్ తీవ్రంగా గాయపడింది.


కొట్టాయం, తిరువల్ల హాస్పిటల్స్‌లో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి కొచ్చిలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా.. ఫిబ్రవరి 13న చిన్నారికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. తమ ఏకైక కూతురు చనిపోతోందని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పుట్టెడు దుఃఖంలో ఉండికూడా చిన్నారి అవయవ దానానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అలెన్ కాలేయం, రెండు కిడ్నీలు, గుండె కవాటం, రెండు కళ్లను.. కేరళ ప్రభుత్వం ‘మృత సంజీవని’ పథకం ద్వారా ప్రాణపాయ స్థితిలో ఉన్న ఐదుగురికి అమర్చారు. తీవ్ర విషాదంలో ఉండి కూడా ఇతరుల ప్రాణాలు కాపాడాలనే ఆలోచనతో ముందుకొచ్చిన అలెన్ తల్లిదండ్రులకు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న వయసులో అవయవ దానం చేయడం కేరళ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన, గొప్ప విషయంగా నిలిచింది.


ఇవి కూడా చదవండి...

ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 14 , 2026 | 06:48 PM