ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దుర్వినియోగంపై రఘురామ ఫైర్
ABN , Publish Date - May 20 , 2026 | 07:44 PM
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కొంతమంది ఇప్పటికే ఆరు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.
పశ్చిమగోదావరి జిల్లా, మే 20 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కొంతమంది ఇప్పటికే ఆరు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దొంగ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం మానేయాలి’ అంటూ వ్యాఖ్యానించారు.
పాస్టర్ అభినయ్ దర్షన్‌పై విమర్శలు..
పాస్టర్ అభినయ్ దర్షన్‌పై కూడా రఘురామ తీవ్ర విమర్శలు చేశారు. ‘పాస్టర్ అభినయ్ దర్శన్ మంచి నటుడు. దర్శకత్వం కూడా ఆయనే చేయాలని అనుకున్నాడు. అన్ని వేషాలు ఒకేసారి వేయాలని ప్రయత్నించాడు’ అంటూ ఎద్దేవా చేశారు. తాను రెచ్చగొట్టడం వల్లే దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేశారని, అలాంటి ఆరోపణలు తనపై రాకుండా పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మత ప్రచారం పేరుతో అనేక నాటకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజోలులో సరెళ్ల విజయ్ ప్రసాద్ (Sarella Vijay Prasad) దళిత క్రైస్తవ శాంతి ర్యాలీ నిర్వహించారని ప్రస్తావించారు. క్రైస్తవ మతంలోకి మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని తెలిపారు.
సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు..
‘ఘర్ వాపసీ ద్వారా తిరిగి హిందూ మతంలోకి రావడానికి అవకాశం ఉంది’ అని రఘురామ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు. గుడి నిర్మాణం పూర్తి చేసే విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండదని, చెత్త రాజకీయాలు చేయడం తన స్వభావం కాదని స్పష్టం చేశారు. ఇవాళ కాకపోతే రేపు పాస్టర్ ఆనంద్ సర్టిఫికెట్ రద్దు అవుతుందని అన్నారు. సుప్రీంకోర్టులో తామే గెలుస్తామని.. నిజాలు బయటకు రావడం ఖాయమని రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం
స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News