సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. 120 ఏళ్ల నిషేధిత జాబితాలోని భూముల సమస్యకు పరిష్కారం
ABN , Publish Date - Sep 09 , 2026 | 06:36 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (బుధవారం) అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. అంబాజీపేట మండలం మాచవరంలో గ్రౌండ్ రెంట్ భూముల్లో నివసిస్తున్న కుటుంబాలను ముఖ్యమంత్రి కలిశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సెప్టెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (బుధవారం) అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. అంబాజీపేట మండలం మాచవరంలో గ్రౌండ్ రెంట్ భూముల్లో నివసిస్తున్న కుటుంబాలను ముఖ్యమంత్రి కలిశారు. ఈ క్రమంలో అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రాపురం, మాచవరంలోని గ్రౌండ్ రెంట్ స్థలాలను 1908 సెక్షన్ 22ఏ1 జాబితా నుంచి విముక్తి కల్పిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
గ్రౌండ్ రెంట్ సైట్స్‌గా 22ఏ1 నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములకు విముక్తి కల్పించి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అప్పగించారు. మాచవరంలోని జయంతి నగర్‌లో లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి వారితో సీఎం మాట్లాడారు. 120 ఏళ్లుగా నిషేధిత జాబితాలో ఉండిపోయిన ఈ భూములకు విముక్తి కల్పించి పత్రాలు ఇస్తున్నట్లు వివరించారు. గ్రౌండ్ రెంట్ స్థలాలను గ్రామ కంఠం భూములతో సమానంగా పరిగణించి 22ఏ1 నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లుగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News