చిన్న శ్రీను రాకతో టీడీపీకి మరింత బలం చేకూరింది: మంత్రి కొండపల్లి
ABN , Publish Date - Sep 15 , 2026 | 11:36 AM
మజ్జి శ్రీనివాసరావు రాకతో టీడీపీకి మరింత బలం చేకూరిందని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మంత్రిని మంగళవారం మర్యాద పూర్వకంగా మజ్జి శ్రీనివాసరావు కలిశారు.
విజయనగరం, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): మజ్జి శ్రీనివాసరావు రాకతో టీడీపీకి మరింత బలం చేకూరిందని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (AP Minister Kondapalli Srinivas) వ్యాఖ్యానించారు. మంత్రిని ఈరోజు (మంగళవారం) మర్యాద పూర్వకంగా మజ్జి శ్రీనివాసరావు కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. చిన్న శ్రీనుకు మంత్రి కొండపల్లి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గంటేడ శ్రీదేవి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడారు. ఆయా నియోజకవర్గాల వారీగా, ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం కేడర్ అంతా కలిసి పనిచేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం: చిన్న శ్రీను
కూటమి నాయకత్వ కార్యాచరణతో స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. నూటికి నూరుశాతం కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ అధ్యక్షులను కలిసి, వారి సూచనలను తీసుకున్నామని వెల్లడించారు. తనతో పాటు నడిచే వచ్చే వారితో కలిసి కూటమి పార్టీల నాయకత్వాన్ని బలపరుస్తామని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్
కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి: మంత్రి ఆనం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News