ఏఎస్ఆర్ విమానాశ్రమంలో డీఆర్ఐ తనిఖీలు.. 4 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Oct 25 , 2026 | 02:27 PM
విజయనగరం జిల్లాలోని ఏఎస్‌ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విశాఖపట్నం డీఆర్‌ఐ అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరం జిల్లా, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాలోని ఏఎస్‌ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విశాఖపట్నం డీఆర్‌ఐ అధికారులు ఈరోజు (ఆదివారం) తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి 4 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు. కోల్‌కతాకు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ (36)ను అరెస్ట్ చేశారు. బ్యాంకాక్ నుంచి గంజాయి సేకరించి సింగపూర్ మీదుగా తరలించినట్లు అధికారులు గుర్తించారు. స్కూట్ విమానంలో ఏఎస్‌ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిందితుడు చేరుకున్నాడు.
ముందస్తు సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు నిందితుడిని పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అధికారులు విచారిస్తున్నారు. మట్టి లేకుండా నియంత్రిత వాతావరణంలో సాగు చేసే హైడ్రోపోనిక్ గంజాయిని నిందితుడు తరలిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ గంజాయికు బ్యాంకాక్ హోల్‌సేల్ మార్కెట్‌లో కిలోకు సుమారు రూ.30 వేల వరకు ధర ఉన్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
కర్నూలు నగర అభివృద్ధి కోసం స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News