అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, టిప్పర్ ఢీ.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Nov 08 , 2026 | 09:11 AM
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సీపట్నం గురుకుల పాఠశాల సమీపంలో కారు, టిప్పర్ బలంగా ఢీకొన్నాయి.
అనకాపల్లి జిల్లా, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఈరోజు (ఆదివారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సీపట్నం గురుకుల పాఠశాల సమీపంలో కారు, టిప్పర్ బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై నర్సీపట్నం టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నర్సీపట్నం టౌన్ సీఐ గఫూర్ ఆధ్వర్యంలో ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News