శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తల మృతి
ABN , Publish Date - Oct 24 , 2026 | 03:15 PM
శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలం శ్రీపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనకనుంచి బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు.
శ్రీకాకుళం జిల్లా, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలం శ్రీపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనకనుంచి బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు. మృతులు శ్రీకాకుళం గుజరాతి పేటకు చెందిన తిప్పన పార్వతి, రామారావుగా గుర్తించారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన
స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు, ఏకగ్రీవాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News