Share News

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లల గొంతు కోసిన తల్లి

ABN , Publish Date - Jun 30 , 2026 | 08:17 AM

శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారుల గొంతు కోసిన అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లల గొంతు కోసిన తల్లి
Srikakulam District Tragic Incident

శ్రీకాకుళం జిల్లా, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులు భవాని(3), చాందిని (మూడు నెలలు) గొంతు కోసిన అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూర్మాపు వరలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు పిల్లల గొంతు కోయగా వారు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. కొన ఊపిరితో ఉన్న తల్లిని చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌ హాస్పిటల్‌కి తరలించారు. సమాచారం అందుకున్న ఆమదాలవలస పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.


ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ కలహాలా, ఆర్థిక సమస్యలా లేదా ఇతర వ్యక్తిగత కారణాలా ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక సూచనలు

జగన్ హయాంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 30 , 2026 | 08:32 AM