సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతాం: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Jun 29 , 2026 | 01:43 PM
కొవిడ్ తర్వాత సైబర్ నేరాలు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం సైబర్ క్రైమ్‌పై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు.
విశాఖపట్నం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ తర్వాత సైబర్ నేరాలు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం సైబర్ క్రైమ్‌పై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు టూల్స్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌లో ఈరోజు (సోమవారం) సైబర్ క్రైమ్స్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ మేళాకు ముఖ్య అతిథిగా హోం మంత్రి అనిత పాల్గొనగా, సీపీ శంఖబ్రాత బాగ్చి, పోలీస్ అధికారులు హాజరయ్యారు. సైబర్ క్రైమ్ బాధితులకు రికవరీ చేసి చెక్కులను హోం మంత్రి అందజేశారు.
సైబర్ క్రైమ్‌లో టెక్నాలజీని పూర్తిగా వాడుతున్నాం..
చదువుకున్నవారే సైబర్ నేరాలకు గురవుతున్నారని హోం మంత్రి అనిత చెప్పుకొచ్చారు. సైబర్ నేరాలకు గురైన 310 మందికి సుమారు ఆరు కోట్ల రూపాయలు రికవరీ చేసి అందించామని తెలిపారు. సైబర్ క్రైమ్‌లో టెక్నాలజీని పూర్తిగా వాడుతున్నామని వివరించారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సైబర్ క్రైమ్‌లో ఎవరైనా మోసపోతే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి: అనిత
ట్రంప్, పుతిన్‌లకు కూడా ఫిర్యాదు చేయండి.. నానిపై శివనాథ్ సెటైర్లు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News