Share News

ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక సూచనలు

ABN , Publish Date - Jun 29 , 2026 | 01:25 PM

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్‌పై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక సూచనలు
AP CM Chandrababu Naidu

అమరావతి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన ఈరోజు (సోమవారం) డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ (RTG)పై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. డేటా ఆధారిత పాలన, నిర్ణయాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. ప్రభుత్వ సేవల సామర్థ్యాన్ని పెంచే అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు, డేటా వినియోగంపై సమీక్షిస్తున్నారు.


ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, అదనపు డీజీ ఇంటెలిజెన్స్ మహేశ్ చంద్ర లడ్డా, ఐటీ, ఆర్టీజీఎస్, జీఎస్‌డబ్ల్యూఎస్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, వివిధ శాఖల ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు, విద్యుత్, విపత్తుల నిర్వహణ, ఆర్థిక, సమాచార శాఖల ఉన్నతాధికారులు, మంత్రి కొలుసు పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర పరిపాలనలో డేటా ఆధారిత నిర్ణయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షిస్తున్నారు.


జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు సర్క్యులర్ జారీ..

జిల్లాల్లో అధికారుల క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం చంద్రబాబు సర్క్యులర్ జారీ చేశారు. నవంబర్ 12, 13వ తేదీలో విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సును ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీల అధినేతలు, సీఈవోలను ఈ సదస్సుకు ప్రభుత్వం ఆహ్వానించనుంది. అయితే, సీఐఐ భాగస్వామ్య సదస్సుపై సీఎం సమీక్షించనున్నారు.


అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం సమీక్ష..

అలాగే, అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సీఆర్డీఏ అధికారులు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల వేగవంతంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మంత్రి పొంగూరు నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ విజయ్ విజయరామరాజులు హాజరయ్యారు. ఏడీసీఎల్, సీఆర్డీఏ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఎల్ అండ్ టీ, ఎన్‌సీసీ, ఎంఈఐఎల్, కేఎంవీ, బీఎస్‌సీపీఎల్, ఎంవీఆర్ సహా పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అమరావతి ప్రాజెక్టుల ప్రస్తుత పురోగతి, తదుపరి కార్యాచరణపై చర్చించారు. నిర్మాణ పనులను నిర్దేశిత గడువుల్లో పూర్తి చేసే అంశంపై సమీక్షించారు. రాజధాని అభివృద్ధి పనుల నాణ్యత, వేగంపై సీఎం ప్రత్యేక దృష్టిసారించారు. ప్రభుత్వ సేవలు మరింత సులభతరం చేయాలని ఆదేశించారు. మనమిత్ర ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి: అనిత

ట్రంప్, పుతిన్‌లకు కూడా ఫిర్యాదు చేయండి.. నానిపై శివనాథ్ సెటైర్లు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 29 , 2026 | 02:34 PM