Share News

వైసీపీ ఓటు అడిగే నైతిక హక్కును కోల్పోయింది: మంత్రి సవిత

ABN , Publish Date - Nov 18 , 2026 | 08:09 PM

ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేకనే.. వైసీపీ దాడులకు పాల్పడుతోందని మంత్రి సవిత ఆరోపించారు. వైసీపీ ఓటు అడిగే నైతిక హక్కును కోల్పోయిందని మంత్రి విమర్శించారు. జగన్ ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే చేసి చూపించిందన్నారు.

వైసీపీ ఓటు అడిగే నైతిక హక్కును కోల్పోయింది: మంత్రి సవిత
savita criticizes ysrcp

సత్యసాయి జిల్లా, నవంబర్ 18: ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేకనే.. వైసీపీ దాడులకు పాల్పడుతోందని మంత్రి సవిత ఆరోపించారు. జగన్ ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే చేసి చూపించిందని.. వైసీపీ ఓటు అడిగే నైతిక హక్కును కోల్పోయిందని మంత్రి విమర్శించారు.


ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి సవిత.. వైసీపీపై విమర్శలు గుప్పించారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేకనే వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం 2.5 ఏళ్లలో చేసి చూపించిందని.. అందుకే ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతోందని పేర్కొన్నారు. ఓటు అడిగే నైతిక హక్కును వైసీపీ కోల్పోయిందని.. అందుకే ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం లేక దాడులకు పాల్పడుతోందన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని.. స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం స్వీప్ చేయబోతోందని మంత్రి సవిత అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ విజయానికి పునాదని.. ప్రజాతీర్పుతో మరోసారి కూటమి సత్తా చాటబోతోంది మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలి: సీఎం చంద్రబాబు

బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఏపీలో భారీ వర్షాలు..!

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఏపీ సమస్యలపై చర్చ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 08:09 PM