అరుణాచల్‌లో విధి నిర్వహణలో వీరమరణం.. సీఎం దిగ్భ్రాంతి
ABN , Publish Date - Sep 30 , 2026 | 10:02 PM
అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్ హవిల్దార్ కువ్వారపు కిషన్ మృతి చెందారు. ఆయన మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 30: అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రకాశం జిల్లాకు చెందిన భారత జవాన్ హవిల్దార్ కువ్వారపు కిషన్ పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి జిల్లా వాసులకు తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.
'అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన, ప్రకాశం జిల్లాకు చెందిన మన ఆంధ్ర నేల ధైర్యశాలి, జవాన్ హవల్దార్ కువ్వారపు కిషన్ మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. దేశానికి ఆయన చేసిన ధైర్యసాహసాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఈ విచారకర సమయంలో ప్రభుత్వం వారికి ఉంటుంది' అని ఎక్స్‌లో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
దేశ సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన కిషన్‌కు పలువురు ఘన నివాళులు అర్పించారు. ఆయన త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరవదని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..
‘యూపీలో అన్ని దర్యాప్తులు సీబీఐకే అప్పగించాలా?’